Thursday, March 7, 2019

రానున్న విద్య సంవత్సరానికి 2019-20 లో 5, 6, 7, 8వ తరగతులలో ప్రవేశానికి గాను రాష్ట్ర మైనారిటీ శాఖ అధికారులు  అర్హులైన విధ్యార్ధులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కావున మన ఊరి(రేమద్దుల) నుండి ఎవరైనా ఉంటె, ఈ అవకాశాన్ని వినియోగించు కుంటారని website లో పోస్ట్ చేయడం జరుగుతున్నది.

విద్యా సంవత్సరం : 2019-20

అర్హులు: మైనారిటి విద్యార్థులతో పాటు SC, ST, BC మరియు OC విద్యార్థులకు రిజర్వేషన్స్ ప్రకారం

దరఖాస్తు చివరి తేదీ: 31.03.2019

పరీక్ష తేదీ: 20-ఏప్రిల్-2019 -  5 వ తరగతి
                    22-ఏప్రిల్-2019 -  6వ, 7వ, 8వ  తరగతులు

ఎక్కడ అప్లై చెయ్యాలి: http://tmreis.telangana.gov.in/

Credits to
www.epaper.eenadu.net.

మన ఉరిలో(రేమద్దుల) రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించబడ్డాయి. మన ఊరి సర్పంచ్ మంజుల తిరుపతయ్య ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాలనుండి 11 ఎద్దుల జతలు పోటీలో పాల్గొన్నాయి. 

జరిగిన రోజు : 05.03.2019

గెలిచిన  వారి వివరాలు
మొదటి స్థానం : చక్రవర్తి గౌడ్ ఎద్దులు - శనగపల్లి, ఇటిక్యాల 
రెండవ స్థానం: వీరేష్ గౌడ్ - ఇందువాసి, గట్టు 
మూడవ స్థానం : వెంకటేశ్వరరావు - చంద్రకల్ , పెద్దకొత్తపల్లి 
నాల్గవ స్థానం : లింగాల స్వామి - అంబటి పల్లి 
అయిదవ స్థానం: రామచంద్ర రెడ్డి - రాయవరం 

ఫొటోలు








వీడియోలు 





వార్తా క్లిప్పింగ్స్ 





Monday, March 4, 2019

May Lord Shiva give power and strength to everyone facing difficulties.
Wishing you and your family Maha Shivaratri.


Friday, March 1, 2019


గోపాల శివ S/O గోపాల మల్లయ్య , రేమద్దుల SSC -2005-2006 బ్యాచ్ , 'అభినవ శూరుడా ' అంటూ పాకిస్తాన్ అదుపులో ఉండి ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ను తలుచుకుంటూ రాసిన కవిత.

All the best Shiva. ముందు ముందు ఇంకా పైకి ఎదగాలని మరియు మంచి కవితలు రాయాలని ఆశిస్తున్నాము.

ప్రస్తుతం గోపాల శివ 99 టీవి హైదరాబాద్ హెడ్ ఆఫీసులో వీడియో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
అభినవ శూరుడా !

వీరుడా అభినవ శూరుడా..
తోడేళ్ళ మందకు ఆహారం
అవుతున్నావని తెలిసినా
అదరక బెదరక తలవంచక
సింహమై గర్జించిన నీ ధీరత్వానికి
యావత్ భారతం సలాం కొడుతోంది..
రాబందుల రాజ్యంలో
ఆ రాకాసుల చేతుల్లో
ముఖమంతా రుధిరంతో
బతుకును పణంగా పెట్టి
జైహింద్ అన్న నీ పరాక్రమానికి
అశేతు హిమాచలం
మంచు వర్షం కురిపిస్తోంది

భారతమ్మ బిడ్డల నుదుట
సింధూరాన్ని తుడిపేసిన
విషనాగుల చెరలో నీవున్నా

మొక్కవోని ధైర్య సాహసంతో
సవాల్ విసిరిన నీ పరాక్రమం
120 కోట్ల అభిమానుల
గుండె చప్పుడై మారుమోగుతోంది.

సింహం ఎక్కడున్నా సింహమేరా
ఈ కళ్ళల్లో మండుతున్న అగ్ని ధాటికి
మీ అరాచక శక్తులు బూడిద కాక తప్పదురా..

శత్రువులకు దడపుట్టించి
మాతృభూమికి తిరిగివస్తున్న
వీరుడా వందనం..
ధీరుడా అభివందనం...🙏
జై హింద్ జై జవాన్ జై జై జవాన్

Wednesday, February 27, 2019

ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా తీసిన ఫోటోలు.

స్వయం పరిపాలన దినోత్సవం జరిగిన రోజు : 26.02.2019





Monday, February 25, 2019

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని ఉట్కూరి మండలం, బిజ్వార్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి నిరూపించాడు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికెషన్స్కు అప్లై చేసుకొని ప్రణాళిక ప్రకారం చదివి ఒకేసారి అయిదు ఉద్యోగాలకు ఎంపికైనాడు.

ప్రేరణకు ప్రతి ఒక్కరికి అబ్దుల్ కలాం జీవితమే కావలిసిన అవసరం లేదు. మీ చుట్టు పక్కల కూడా ఎన్నో ప్రేరణాత్మక కథలు ఉంటాయి.

మన ఊరినుండి కూడా ఇలాంటి ప్రేరేపింప దగిన కథలు ఉంటె, remaddula.info@gmail.com లేదా 7995391030 కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు


CREDITS to: www.epaper.eenadu.net