Showing posts with label తెలుగు కవిత. Show all posts
Showing posts with label తెలుగు కవిత. Show all posts

Friday, March 1, 2019


గోపాల శివ S/O గోపాల మల్లయ్య , రేమద్దుల SSC -2005-2006 బ్యాచ్ , 'అభినవ శూరుడా ' అంటూ పాకిస్తాన్ అదుపులో ఉండి ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ను తలుచుకుంటూ రాసిన కవిత.

All the best Shiva. ముందు ముందు ఇంకా పైకి ఎదగాలని మరియు మంచి కవితలు రాయాలని ఆశిస్తున్నాము.

ప్రస్తుతం గోపాల శివ 99 టీవి హైదరాబాద్ హెడ్ ఆఫీసులో వీడియో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
అభినవ శూరుడా !

వీరుడా అభినవ శూరుడా..
తోడేళ్ళ మందకు ఆహారం
అవుతున్నావని తెలిసినా
అదరక బెదరక తలవంచక
సింహమై గర్జించిన నీ ధీరత్వానికి
యావత్ భారతం సలాం కొడుతోంది..
రాబందుల రాజ్యంలో
ఆ రాకాసుల చేతుల్లో
ముఖమంతా రుధిరంతో
బతుకును పణంగా పెట్టి
జైహింద్ అన్న నీ పరాక్రమానికి
అశేతు హిమాచలం
మంచు వర్షం కురిపిస్తోంది

భారతమ్మ బిడ్డల నుదుట
సింధూరాన్ని తుడిపేసిన
విషనాగుల చెరలో నీవున్నా

మొక్కవోని ధైర్య సాహసంతో
సవాల్ విసిరిన నీ పరాక్రమం
120 కోట్ల అభిమానుల
గుండె చప్పుడై మారుమోగుతోంది.

సింహం ఎక్కడున్నా సింహమేరా
ఈ కళ్ళల్లో మండుతున్న అగ్ని ధాటికి
మీ అరాచక శక్తులు బూడిద కాక తప్పదురా..

శత్రువులకు దడపుట్టించి
మాతృభూమికి తిరిగివస్తున్న
వీరుడా వందనం..
ధీరుడా అభివందనం...🙏
జై హింద్ జై జవాన్ జై జై జవాన్

Sunday, February 17, 2019


సన్నొజు రఘవర్దన్, రేమద్దుల  SSC -1995 బ్యాచ్ , 'వీర కిశోరమా ' అంటూ సదా జాతిని రక్షించే వీర జవానులకు ఓ కవిత ద్వారా అక్షరహారతి పట్టారు. 

ప్రస్తుతం రఘు తెలుగు పండితుడుగా మహబూబ్ నగర్ జిల్లా, వెన్నచేడ్ ఆదర్శ్ పాఠశాల లో పనిచేయు చున్నాడు.